Online vs Offline: ఆన్‌లైన్‌లో ఆర్డర్.. ఛార్జీలు భారీగా: యూజర్ పోస్ట్ వైరల్
Online vs Offline: ఇంటికి నలుగురు గెస్ట్‌లు వచ్చారంటే ఇంతకు ముందు రెస్టారెంట్‌కు వెళ్లేవారు.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి ఒకటో రెండో ఫ్యామిలీ ఫ్యాక్‌లు బుక్ చేశామంటే ఇంటిల్లపాది గెస్ట్‌లతో సహా సుష్టుగా తినొచ్చు.. టైమ్, మనీ రెండు కలిసొస్తాయని అనుకుంటున్నారు.;
Online vs Offline: ఇంటికి నలుగురు గెస్ట్‌లు వచ్చారంటే ఇంతకు ముందు రెస్టారెంట్‌కు వెళ్లేవారు.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి ఒకటో రెండో ఫ్యామిలీ ఫ్యాక్‌లు బుక్ చేశామంటే ఇంటిల్లపాది గెస్ట్‌లతో సహా సుష్టుగా తినొచ్చు.. టైమ్, మనీ రెండు కలిసొస్తాయని అనుకుంటున్నారు. అదే స్విగ్గీ, జొమాటో వంటి వారికి వరంగా మారింది.. ఇంట్లో ఫుడ్డు నచ్చకపోయినా ఇట్టే ఆర్డర్ పెట్టేస్తున్నారు.. కావలసింది తెప్పించుకుని తినేస్తున్నారు.. అయితే రెస్టారెంట్‌కు వెళ్లి తింటే తక్కువవుతుంది.. అదే ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే ఎక్కువ ఛార్జి వసూలు చేస్తున్నారని ముంబయికి చెందిన ఓ లింక్డిన్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.. పుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లను మోసం చేస్తున్నాయని పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది.
ముంబయికి చెందిన రాహుల్ కబ్రా ముంబయిలోని ది మోమో ఫ్యాక్టరీ అనే రెస్టారెంట్ నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. దానికి బిల్లు రూ.690లు చెల్లించాడు.. అదే ఫుడ్‌ను అతడు రెస్టారెంట్‌కు వెళ్లి తెచ్చుకున్నప్పుడు రూ. 512లు అయ్యిందని గుర్తించాడు. దీంతో ఆ రెండు బిల్లులను లింక్డిన్‌లో పోస్ట్ చేస్తూ తాను దాదాపు 35 శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
సోషల్ మీడియాలో రాహుల్ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.. దీనికి దాదాపు 10వేల లైకులు రాగా, వందల్లో కామెంట్లు వచ్చాయి.. ఆర్డర్ ఇస్తే ఆ మాత్రం ఖర్చవకుండా ఎందుకుంటుంది.. డెలివరీ బాయ్‌కి ఛార్జస్ ఉండవా.. పెట్రోల్ ఖర్చు ఉండదా అని కొందరు రాహుల్‌ని తప్పుపట్టారు.. మరి అలాంటప్పుడు బయటికి వెళ్లి తెచ్చుకుని తినొచ్చుగా అని కామెంట్ చేస్తున్నారు.