Oscar 2023 : RRR టీంకు ప్రధాని మోదీ అభినందనలు

Update: 2023-03-13 06:09 GMT

RRR టీంను అభినందించారు ప్రధాని మోదీ. RRR యొక్క 'నాటు నాటు' సాంగ్  ఆస్కార్ గెలుపొందడం భారత్ గర్వపడేలా చేసిందన్నారు. "భారతదేశం ఇప్పుడు సంతోషిస్తోంది! ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 2023లో ట్రోఫీలను గెలుచుకోవడం మనందరికీ గర్వకారణం. చిత్ర యునిట్ కు శుభాకాంక్షలు" అని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

RRR బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ "అనూహ్యంగా! 'నాటు నాటు' యొక్క ప్రజాదరణ ప్రపంచవ్యాప్తమైంది. ఇది రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది. కీరవాణి, చంద్రబోస్ తో పాటు మొత్తం బృందానికి అభినందనలు ఈ ప్రతిష్టాత్మక గౌరవం కోసం. భారతదేశం ఉప్పొంగింది, గర్విస్తోంది" అని అన్నారు మోదీ.

RRR టీంకు తమిళనాడు సిఎం  అభినందనలు..
తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్   RRR, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అభినందనలు తెలిపారు. "#NaatuNaatu #ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న మొదటి భారతీయ, ఆసియా పాటగా చరిత్ర సృష్టించిందని చెప్పారు. మ్యూజిక్ డైకక్టర్ కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, దర్మకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్, తారక్ తో పాటు మొత్తం చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు స్టాలిన్.

Similar News