Black Fungus: దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు..!
Black Fungus: ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్.. పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది.;
Black Fungus: ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్.. పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయినట్లు కేంద్రమంత్రి సదానంద గౌడ ప్రకటించారు. ఈ రోగులకు 23,680 అంఫోటెరిసిన్-బీ వ్యాక్సిన్ వయలను ఆయా రాష్ట్రాలకు పంపామన్నారు. గుజరాత్ లో అత్యధికంగా 2,281 కేసులు నమోదు కావడంతో అక్కడికి 5,800 వయల్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏపీలో 910 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా.. 2,310 వయల్స్, తెలంగాణలో 350 కేసులు నమోదుకాగా.. 890 వయల్స్ కేటాయించామన్నారు. అయితే ఇక ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినా.. దీని బారినపడిన వారికి రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.