దేవాలయాలకు రక్షణ కల్పించలేని అసమర్థ సీఎం జగన్: టీడీపీ నేత పట్టాభి
పాకిస్థాన్‌లో దేవాలయంపై దాడి జరిగితే 24గంటల్లోనే..;
సీఎం జగన్ వ్యాఖ్యలను ఖండించారు టీడీపీ నేత పట్టాభి. దేవాలయాలకు రక్షణ కల్పించలేని అసమర్థ సీఎంగా జగన్ ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ దగ్గర 136 సంఘటనలకు సంబంధించిన ఆధారాలున్నాయని.. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పాకిస్థాన్‌లో దేవాలయంపై దాడి జరిగితే 24గంటల్లోనే కారకులైన 45 మందిని అరెస్ట్ చేశారని. కానీ ఏపీలో 136 సంఘటనలు జరిగితే, ఒక్కరినైనా అరెస్ట్ చేయించగలిగారా అని ప్రశ్నించారు. నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనం టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకున్న దేవాదాయమంత్రికి అశోక్ గజపతి రాజుగురించి మాట్లాడే అర్హత ఉందా అన్నారు పట్టాభి..