నా కల నిజమవుతోంది: బండ్ల గణేష్
దీంతో ఆ రోజుకోసం ఎదురు చూస్తున్న గణేష్.. ఆ రోజు రానే వచ్చిందంటూ ఓ తీపి కబురుని ట్విట్టర్‌లో షేర్ చేశారు..;
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనతో సినిమా చేయాలని నిజానికి ఏ నిర్మాత అయినా ఉవ్విళ్లూరుతుంటారు. అందులో మొదటగా చెప్పుకోవలసింది బండ్ల గణేష్ పేరు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తీన్‌మార్, గబ్బర్ సింగ్.. తీన్‌మార్ పరాజయాన్ని తెచ్చిపెట్టినా.. గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అదే ఊపుతో ఆయనతో మరో సినిమా చేయాలనుకున్నా అవకాశం దొరకలేదు బండ్ల గణేశ్‌కి.
దీంతో ఆ రోజుకోసం ఎదురు చూస్తున్న గణేష్.. ఆ రోజు రానే వచ్చిందంటూ ఓ తీపి కబురుని ట్విట్టర్‌లో షేర్ చేశారు.. మా బాస్ ఓకే చెప్పారు. నా కల నిజమవుతోంది. ఆ దేవుడికి ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరూ అనే విషయం తెలియాల్సి ఉంది. 2015లో వచ్చిన 'టెంపర్' చిత్రం తరువాత బండ్ల గణేష్ మరే సినిమాను చేయలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత తన అభిమాన హీరోతో, తన ఆరాధ్య దైవంతో సినిమాను చేయబోతున్నందుకు బండ్ల గణేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
My boss said okay and once again my dreams come true .
— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2020
Thank you my god @PawanKalyan 🙏. pic.twitter.com/x0s1nQy3Fy