ఇందన ధరల పెంపుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. మండిపడ్డ న్యాయస్థానం
పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేరళకు చెందిన న్యాయవాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు.;
పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేరళకు చెందిన న్యాయవాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నా.. పెట్రోల్, డీజిట్ ధరలు మాత్రం పెంచుతున్నారని ఈ విషయంలో న్యాయంస్థానం జోక్యం చేసుకోవాలని పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్థిక విధానానికి సంబంధించిన అంశంపై పిల్ వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. పిటిషన్‌ను కొనసాగించాలనుకుంటే పిటిషనర్ భారీ జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను సదరు పిటిషనర్ వెనక్కు తీసుకున్నారు.