మారిన పీఎం కిసాన్ స్కీమ్.. రూ.6వేలు అకౌంట్లో పడాలంటే ఇకపై..

పొలం తల్లిదండ్రుల పేరు మీద ఉండి మీరు వ్యవసాయ పనులు చేస్తున్నారంటే కూడా కుదరదు.;

Update: 2021-02-09 08:46 GMT

మోదీ సర్కార్ రైతుల కోసం తీసుకు వచ్చిన 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌'లో రూల్స్ మారాయి. ఈ స్కీమ్ కింద పొందే రూ.6 వేలు ఇకపై కచ్చితంగా పొలం ఎవరి పేరు మీద ఉంటుందో వారికే వర్తిస్తుంది. కొత్తగా ఈ స్కీమ్‌లో చేరే వారికి ఈ రూల్ వర్తిస్తుంది. ఈ పథకంలో చేరిన రైతులకు ఏడాదికి రూ.6వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

పొలం తల్లిదండ్రుల పేరు మీద ఉండి మీరు వ్యవసాయ పనులు చేస్తున్నారంటే కూడా కుదరదు. పొలాన్ని తమ పేరు మీదకి మార్చుకుంటే ఆ డబ్బు వస్తుంది. అంతే కాదు పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు. వీటితో పాటు ఇంట్లో ఎవరైనా నెలకు రూ.10వేలకు పైగా పెన్షన్ తీసుకుంటున్నా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా రూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందడం వీలు కాదు. ఇందు కోసం మీరు పెట్టుకున్న అప్లికేషన్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తేనే కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి.

Tags:    

Similar News