Rahul Gandhi On Modi : మందులతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదు : రాహుల్ గాంధీ

Rahul Gandhi On Modi : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు.;

Update: 2021-05-13 11:55 GMT

Rahul Gandhi On Modi : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. కరోనా ఉద్ధృతిపై ప్రధాని కనీసం స్పందించడం లేదంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. 'మహమ్మారి సమయంలో టీకాలు, ఆక్సిజన్, మందులతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదు' ఇక మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, ఔషధాలపై జీఎస్టీ, అక్కడ ఇక్కడ ఉన్న ప్రధాని ఫొటోలు' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కాగా కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ నేతలు మండిపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉచితంగా చేపట్టాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలు నిన్న ప్రధానికి లేఖ రాశారు. 

Tags:    

Similar News