కేంద్ర మాజీ మంత్రి మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!

1982 నుంచి 1984 మధ్య భారత్ కు తొలిపర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన గుజరాత్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జలా(88) ఇవాళ మృతిచెందారు

Update: 2021-04-04 08:03 GMT

1982 నుంచి 1984 మధ్య భారత్ కు తొలిపర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన గుజరాత్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జలా(88) ఇవాళ మృతిచెందారు. 1962-67 కాలంలో వాంఖనేర్ నుంచి తొలిసారి ఇండిపెండెంట్ MLAగా ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత 1967-71 మధ్య సమాజ్ వాద్ పార్టీలో ఉన్నారు. అనంతరం కాంగ్రెస్ తరఫున 1979-1989 మధ్య 2 సార్లు ఎంపీ అయ్యారు. పర్యావరణంపై ఐకరాజ్య సమితిలోనూ ఆయన గళమెత్తారు. కాగా ఆయన మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో పర్యావరణ మంత్రిత్వ శాఖను స్థాపించిన దిగ్విజయ్ సింగ్ జలా.. 1982 నుండి 1984 వరకు దేశంలో మొదటి పర్యావరణ మంత్రి అయ్యారు.

Tags:    

Similar News