PM Modi : రంజాన్, అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..!
PM Modi: ఈద్ -ఉల్- ఫితర్, అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.;
ఈద్ -ఉల్- ఫితర్, అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా'.. ఈద్ ముబారక్ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక 'దేశవాసులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శుభకార్యాల సాధనతో ముడిపడి ఉన్న ఈ పవిత్ర పండుగ కరోనా మహమ్మారిని జయించాలనే మన సంకల్పాన్ని గ్రహించే శక్తిని ఇవ్వాలి' అంటూ మరో ట్వీట్ చేశారు. అటు ఈ రోజు బసవ జయంతి సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.