Modi on Budget : కేంద్ర బడ్జెట్ ద్వారా అనేక రంగాలకు లబ్ధి : మోదీ
Modi on Budget : నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన : మోదీ;
కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అనీ.. ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. ''మన జీవన విధానంలో అన్ని రంగాల్లో సాంకేతికత చేరింది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు వచ్చి చేరాయి. ప్రతి పేద వాడికి సొంతిల్లు ఉండాలి. ప్రతి ఇంటికి అంతర్జాల సౌకర్యం ఉండాలి. కిసాన్ డ్రోన్లు, వందేభారత్ రైళ్లు, డిజిటల్ కరెన్సీకి ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పించాం. బ్యాంకింగ్ రంగంలోకి కొత్తగా డిజిటల్ యూనిట్లు వచ్చాయి. జాతీయ ఆరోగ్య పథకం కింద డిజిటల్ ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం. వ్యవసాయ అంకురాల ప్రోత్సాహానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. కొండ ప్రాంత ప్రలజ జీవన విధానం సులభతరానికి కృషి చేస్తాం. కేంద్ర బడ్జెట్ ద్వారా అనేక రంగాలకు లబ్ధి చేకూరింది'' అన్నారు.