Cyclone Yaas: యాస్ తుపానుపై ప్రధాని మోదీ సమీక్ష..!
Narendra Modi : యాస్ తుపాను సన్నద్దతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ద్వారా పలు మంత్రిత్ర్వ శాఖల అధికారులతో మాట్లాడారు.;
Narendra Modi : యాస్ తుపాను సన్నద్దతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ద్వారా పలు మంత్రిత్ర్వ శాఖల అధికారులతో మాట్లాడిన మోదీ..టెలికాం, విద్యుత్, పౌరవిమానయాన, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో ముందస్తు జాగ్రత్తల పైన చర్చించారు. తుపాను సమయంలో ముప్పు ప్రాంతాల ప్రజలతోపాటు ఇప్పటికే కొవిడ్ చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రధాని మోదీ సూచించారు. కాగా ఈ నెల 26న ఒడిషా - బెంగాల్ మధ్య తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో 46 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కేంద్రం సిద్ధం చేసింది. పలు రాష్ట్రాలకి NDRF బృందాలను పంపించే అవకాశం ఉంది.