తిరుపతి కుర్రాడి పై ప్రధాని మోదీ ప్రశంసలు.. !
వాతావరణం పైన ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న తెలుగు కుర్రాడి పైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.;
వాతావరణం పైన ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న తెలుగు కుర్రాడి పైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మాన్ కీ బాత్ లో మోదీ తిరుపతికి చెందిన సాయిప్రణీత్‌ని అభినందించారు. సాయిప్రణీత్ 'Andhrapradesh Weatherman' అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి గత ఏడేళ్ళుగా వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాడు. వర్షాల పైన రైతులను అలెర్ట్ చేస్తున్నందుకు గాను మోదీ సాయిప్రణీత్ ని అభినందించారు. సాయిప్రణీత్ దేశానికి ఎంతో అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న సాయిప్రణీత్.. ఇప్పటికే IMD, UNOలనుంచి ప్రశంసలు అందుకున్నాడు. అదేవిధంగా చండీగఢ్‌కు చెందిన 29 ఏళ్ల సంజయ్‌రాణాను కూడా మోదీ ప్రశంసించారు. ఆ యువకుడు ఫుడ్‌స్టాల్‌ను నిర్వహిస్తుంటాడని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భతూర్ అనే వంటకాన్ని అమ్ముతుంటాడని మోదీ అన్నారు.