ఈ ఘనత చూసి ప్రతిపక్షాలకు జ్వరం పట్టుకుంది : మోదీ
అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్ ను వందశాతం పూర్తి చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.;
అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్ ను వందశాతం పూర్తి చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నిన్న ఒకే రోజులో రెండు కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేసి భారత్ తన నిబద్దతను చాటుకుందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. ఈ రికార్డు చూసి ప్రతిపక్షాల్లో జ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు.అంతకుముందు గోవాలోని ఆరోగ్యకార్యకర్తలు, కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులతో వర్చువల్ గా ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా వంద శాతం కోవిడ్ తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన గోవాను అభినందించారు. భారీ వర్షాలు, వాతావరణ అనుకూల పరిస్థితుల్లోనూ గోవా ఈ ఘనత సాధించి అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ ఘనత సాధించడంలో డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది సేవలు ఎనలేనివని కితాబిచ్చారు.