Narendra Modi : వాణిజ్య మాఫియా చేతిలో పంజాబ్ నలిగిపోతోంది : ప్రధాని మోదీ
Narendra Modi : పంజాబ్ ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.;
Narendra Modi : పంజాబ్ ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేయకుండా అబద్దాలతో గడిపేశారని విమర్శించారు. వాణిజ్య మాఫియా చేతిలో పంజాబ్ నలిగిపోతోందన్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ధ్వజమెత్తారు. పంజాబ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రధాని మోదీ ప్రజలను అభ్యర్థించారు.