Modi Kedarnath : కేదార్‌నాథ్‌ను రేపు సందర్శించనున్న ప్రధాని మోదీ
Modi Kedarnath : ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్‌ను ప్రధాని మోదీ రేపు సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు.;
Modi Kedarnath : ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్‌ను ప్రధాని మోదీ రేపు సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఆదిశంకరాచార్య సమాధిని, విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే 250 కోట్లతో చేపడుతున్న కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును.. కేదార్ నాథ్ ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభిస్తారు. 2013 లో వచ్చిన భారీ వరదలకు ఆది శంకరాచార్య సమాధితో పాటు కేదార్‌నాథ్ లో పలు కట్టడాలు ధ్వంససమవడంతో వాటిని పునర్నిర్మిస్తున్నారు.