Narendra Modi : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో మోదీ సమావేశం
Narendra Modi : భారత్- నేపాల్ మధ్య ఉన్న బహిరంగ సరిహద్దులను దుర్వినియోగం చేయవద్దన్నారు ప్రధాని మోదీ.;
Narendra Modi : భారత్- నేపాల్ మధ్య ఉన్న బహిరంగ సరిహద్దులను దుర్వినియోగం చేయవద్దన్నారు ప్రధాని మోదీ. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో సమావేశం అనంతరం.. మోదీ మాట్లాడారు. ఉగ్రవాదులు చేతిలో బరిహంగ సరిహద్దులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. భారత్, నేపాల్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలు విభిన్నమైనవని.. ఇలాంటి స్నేహం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. రక్షణ, భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని ఇరు దేశాలు కొనసాగించాలన్నారు మోదీ.
భారత్ - నేపాల్ మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. రైల్వేలు, శక్తి రంగాల్లో సంబంధాలను మరింత విస్తృత పరిచేందుకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, ఆర్థిక భాగస్వామ్యం, వ్యాపారం, ఆరోగ్య రంగంలో సహకారం, ఇరు దేశ ప్రజల అనుసంధానం, నేపాల్-భారత్ మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు. రేపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని ఆయన సందర్శిస్తారు.
గత ఏడాది జులైలో ఐదవసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని దేవుబా విదేశాల్లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021 జూలైలో నేపాల్ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన ఆయన... దేవుబా భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. బహదూర్ దేవుబా.. చివరిగా 2017లో భారత్‌ను సందర్శించారు.