Narendra Modi : జనసంద్రం మధ్య ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

Narendra Modi : ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో నమో నామం మోరుమోగింది. గల్లీల్లో కాషాయ జెండా రెపరెపలాడాయి;

Update: 2022-03-04 14:45 GMT

Narendra Modi :  ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో నమో నామం మోరుమోగింది. గల్లీల్లో కాషాయ జెండా రెపరెపలాడాయి. జనంతో వీధులు, రోడ్లు కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. ఎటు చూసినా జనసంద్రమే. ఇదంతా యూపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో కనిపించిన దృశ్యాలు. యూపీలో ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంది. మార్చి 7న చివరి విడత పోలింగ్ ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. కీలకమైన యూపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులతో గల్లీ, రోడ్లు పూర్తిగా నిండిపోయాయి. జనసంద్రం మధ్యే భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags:    

Similar News