Modi To Interact With Farmers : డిసెంబర్ 25న రైతులతో ప్రధాని మోడీ భేటి!

వ్యవసాయ చట్టాల పైన అవగాహన కల్పించేందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25 న ప్రధాని నరేంద్ర మోడీ రైతులతో సంభాషించనున్నారు.

Update: 2020-12-20 11:01 GMT

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు(new farm laws) వ్యతిరేకంగా రైతులు గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి వ్యవసాయ చట్టాల పైన అవగాహన కల్పించేందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) జయంతి సందర్భంగా డిసెంబర్ 25 న ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) రైతులతో సంభాషించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 2,500 కి పైగా ప్రదేశాలలో పార్టీ "కిసాన్ సంవాద్" నిర్వహిస్తుందని బీజేపీ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

ఈ క్రమంలో యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ సింగ్‌, పార్టీ నాయకుడు రాధామోహన్‌ సింగ్‌లు(Radha Mohan Singh) కార్యకర్తలతో వర్చువల్‌గా వర్చువల్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వాలు ఈ సంస్కరణలు తీసుకువచ్చి ఉంటే రైతుల పరిస్థితి బాగుండేదని రాధామోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రతిపక్ష, విపక్ష పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News