Narendra Modi : కరోనా టీకాల వృథాను అరికట్టాలి : మోదీ

Narendra Modi : కరోనా టీకాల వృథాను అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. 10 రాష్ట్రాలకు చెందిన జిల్లాల అధికారులతో వర్చువల్ గా భేటీ అయ్యారు.

Update: 2021-05-20 10:56 GMT

Narendra Modi : కరోనా టీకాల వృథాను అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. 10 రాష్ట్రాలకు చెందిన జిల్లాల అధికారులతో వర్చువల్ గా భేటీ అయిన ఆయన.. ఒక్కో డోసు వృథా ఒక జీవితానికి రక్షణ కల్పించే అవకాశం వృథా అయినట్టేనన్నారు. వందేళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో యువత, చిన్నారులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. రెండో దశలో కరోనా వైరస్‌ గ్రామాలపై కూడా ప్రభావం చూపిస్తుండటంతో ప్రధాని వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశారు. కనిపించని ఈ వైరస్ కాలంతోపాటు మార్పులు చేసుకుంటోందని, దానికి అనుగుణంగా మన విధానాల్లో కూడా మార్పులు చేసుకొని వైరస్ పైన పోరాటం చేయాలనీ అన్నారు. అటు కరోనా టీకా కార్యక్రమం విషయంలో కూడా రాష్ట్రాలు, నిపుణులు ఇచ్చిన సూచనలతో ముందుకు వెళ్తున్నామని మోదీ అన్నారు. 

Tags:    

Similar News