గవర్నర్లతో నేడు సమావేశం కానున్న ప్రధాని, రాష్ట్రపతి

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయవిద్యా విధానంపై రాష్ట్రాల గవర్నలతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ప్రధాని

Update: 2020-09-07 01:48 GMT

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయవిద్యా విధానంపై రాష్ట్రాల గవర్నలతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  సోమవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు వీడియో కాన్షరెన్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాన్ని 'ఉన్నత విద్య రూపాంతరంలో ఎన్‌ఈపీ-2020 పాత్ర' పేరుతో నిర్వహిస్తారు. ఈ సమావేశంలో గవర్నర్లతో పాటు విద్యాశాఖ మంత్రులు, యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు హాజరవుతారు. నూతన విద్యావిదానం లక్ష్యాలు, ఆశయాల గురించి చర్చిస్తారు. ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ గా ఎదగడానికి నూతన విద్యావిధానం ఏ విధంగా ఉపయోగపడుతుందో చర్చకురానుంది. దీనికోసం దేశ వ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్‌ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించింది.

Tags:    

Similar News