ప్రధాని మోడీ తల్లికి రైతు లేఖ!
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హిరాబెన్ మోడీకి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు ఓ లేఖ రాశాడు.;
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. అటు కేంద్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. రైతు సంఘాల ప్రతినిధుల, కేంద్రం మధ్య చర్చలు జరిగినప్పటికీ ఓ కొలిక్కి మాత్రం రావడం లేదు.
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హిరాబెన్ మోడీకి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు ఓ లేఖ రాశాడు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా తమ కుమారుడి మనసు మార్చాలంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఎందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ కోరుతున్నామో ఆ లేఖలో పేర్కొన్నాడు. దేశానికి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలు ఢిల్లీలోని రోడ్లపై పడుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇందులో పిల్లల నుంచి వృద్దులు, మహిళలు కూడా ఉన్నారు. ఇందులో ఇప్పటికే కొందరు మరణించారు కూడా.. ఇది మనందరికీ ఆందోళన కలిగించే విషయం. నేను చాలా ఆశతో ఈ లేఖను రాస్తున్నాను. మీ మాటలు విని మీ కుమారుడు ఈ చట్టాలను రద్దు చేస్తే ఈ దేశమంతా మిమ్మల్ని ప్రేమిస్తుందని, అభిమానిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నాడు.