Politics : "దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఆపండి"
లేఖ రాసిన పార్టీల్లో టీఆర్‌ఎస్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్‌తో పాటు రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్విని యాదవ్ ఉన్నారు;
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఆపాలని తొమ్మిది విపక్షాలు ఆరోపించాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లను విపక్షాలపై ప్రయోగిస్తున్నట్లు ఈ పార్టీలు విమర్శించారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశాయి. లేఖ రాసిన పార్టీల్లో టీఆర్‌ఎస్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్‌తో పాటు రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్విని యాదవ్ ఉన్నారు. వీరితో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్‌సీపీ అధినేత శరత్ పవర్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరే, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ లేఖపై సంతకం పెట్టారు.