post office scheme: పెట్టుబడి రూ .100 నుంచి మొదలు.. 5 సంవత్సరాలలో రూ. 20 లక్షలు..

post office scheme: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడిపై రూ .1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది.

Update: 2021-10-07 06:28 GMT

post office scheme: నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ద్వారా కేవలం రూ .100 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు. మీడబ్బును సురక్షితంగా ఉంచడానికి పోస్ట్ ఆఫీస్ వివిధ ప్రయోజనకరమైన పథకాలు అందిస్తోంది.

ఇది ఇతర స్కీముల కంటే ఎక్కువ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పోస్ట్ఆఫీస్ స్కీమ్‌లు సురక్షితమైనవి. మీరు పెట్టిన పెట్టుబడి భద్రంగా ఉంటుంది. కేవలం రూ .100 పొదుపు చేస్తే కొన్ని సంవత్సరాలలో మీకు అధిక మొత్తంలో అందుతుంది.

పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడిపై రూ .1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. పోస్టాఫీసు పథకంలో చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద రాబడులు పొందాలనుకుంటే ఈ స్కీమును ఎంచుకోవచ్చు.

అదే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) పథకం ద్వారా కేవలం రూ .100 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు.

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ప్రయోజనాలు..

ప్లాన్ NSC ఒక స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. మీరు ఎన్‌ఎస్‌సి పథకాన్ని ఏదైనా పోస్ట్ ఆఫీస్ శాఖలో తెరవొచ్చు. ఇది సుక్షితమైన ప్రభుత్వ పథకం. మీరు ఎన్‌ఎస్‌సిలో ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు.

కావాలంటే, మీరు ఒక సంవత్సరంలోపు డబ్బును ఉపసంహరించుకోవచ్చు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆర్థిక సంవత్సరం ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.

మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి మరియు వడ్డీ రేటు ఎంత?

మీరు ఈ పథకంలో నెలకు కేవలం 100 రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ పథకం వార్షికంగా 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది మరియు మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80 సి కింద 1.5 లక్షల రూపాయల పన్ను మినహాయింపు పొందవచ్చు.

మీరు ఐదేళ్ల వ్యవధి తర్వాత 6.8 శాతం వడ్డీతో రూ. 20.58 లక్షలు సంపాదించాలనుకుంటే, ఐదేళ్ల వ్యవధిలో రూ .15 లక్షలు పెట్టుబడి పెట్టాలి. వడ్డీ రూపేణా లక్ష రూపాయలు పొందుతారు. 

Tags:    

Similar News