prashant kishor : కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిషోర్?
prashant kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌తో జతకట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో విడివిడిగా సమావేశం అయ్యారు;
prashant kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌తో జతకట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో విడివిడిగా సమావేశం అయ్యారు ప్రశాంత్ కిషోర్. అయితే, రాహుల్, ప్రియాంకలతో తను సమావేశం అవడం కేవలం ఊహాగానాలే తప్ప నిజం కాదన్నారు ప్రశాంత్ కిషోర్. కాని, కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలు మాత్రం రాహుల్, ప్రియాంకగాంధీలతో ప్రశాంత్ కిషోర్ సమావేశం అవడం ముమ్మాటికీ నిజమని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్‌కు వివిధ రాష్ట్రాల్లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను అప్పగిస్తే.. ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చించుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తరపున పనిచేస్తారని బలంగా చెబుతున్నారు పార్టీ నేతలు. వచ్చే ఏడాది గుజరాత్, రాజస్తాన్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పీకే టీమ్ సేవలు అందిస్తారని కూడా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బాధ్యతలను.. ప్రశాంత్ కిషోర్ ఒకప్పటి సహచరుడు సునీల్ చూస్తున్నారు. \
2024 ఎన్నికల నాటికి బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమిని తయారుచేసే దిశగా సమావేశాలు జరుగుతున్నాయని జాతీయ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, ప్రశాంత్ కిషోర్... కేసీఆర్, మమత బెనర్జీ, నితీష్ కుమార్ సహా పలువురు కీలక నేతలతో నిరంతరం సమావేశం అవుతూనే ఉన్నారు.