ఇకపై ల్యాండ్ లైన్ నుంచి మొబైల్‌కి కాల్ చేయాలంటే..
భారతీ ఎయిర్ టెల్ ఇప్పటికే వినియోగదారులకు సమాచారం అందించగా;
ల్యాండ్ లైన్ నుంచి ఎవరి మొబైల్ ఫోన్‌కి అయినా కాల్ చేయాలంటే ఇప్పడి వరకు డైరెక్ట్‌గా నెంబర్ ప్రెస్ చేస్తుంటాము. కానీ ఇకపై ముందు తప్పకుండా సున్నా(0) చేర్చిన కాల్ మాత్రమే వెళుతుందట. ఈ మేరకు టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి మొబైల్ నెంబరుకు ముందు సున్నా చేర్చడాన్ని తప్పనిసరి చేస్తూ ల్యాండ్ లైన్ వినియోగదారులకు కంపెనీలు సమాచారం అందించాయి. భారతీ ఎయిర్ టెల్ ఇప్పటికే వినియోగదారులకు సమాచారం అందించగా.. రిలయన్స్ జియో తన కస్టమర్లకు మెసేజ్ ద్వారా తెలియజేస్తోంది.