దేశంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చిచెప్పిన ప్రధాని మోదీ
లాక్‌డౌన్‌పై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.;
లాక్‌డౌన్‌పై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వర్చువల్ పద్ధతితో సమావేశం జరుగుతోంది. దేశంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. కరోనా కేసుల ఆధారంగా లాక్‌డౌన్‌పై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని.. టెస్టుల సంఖ్యను పెంచాలని మోదీ తెలిపారు.