దేశంలోని ప్రతీ రంగం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపొందించాం : మోదీ
రైతులు, గ్రామీణులు ఈ ఏడాది బడ్జెట్‌కు కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది క్రియాశీలక బడ్జెట్ అని తెలిపారు;
రైతులు, గ్రామీణులు ఈ ఏడాది బడ్జెట్‌కు కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది క్రియాశీలక బడ్జెట్ అని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికే ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కనీస మద్దతు ధరలోనూ 1.5 శాతం పెంపు కనిపిస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మోదీ. ఆదాయంతోపాటు ఆరోగ్యంపైనా బడ్జెట్‌లో దృష్టిపెట్టామన్నారు. దేశంలోని ప్రతీరంగంలో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపొందించామన్నారు. దేశంలోని కోస్తా రాష్ట్రాలను బిజినెస్ పవర్‌హౌస్‌లుగా రూపొందించేలా బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు మోదీ.