Rahul Jodo Yatra: దిగ్విజయంగా రాహుల్ భారత్ జోడో యాత్ర
Rahul Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది.
Rahul Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. రాజస్థాన్ లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రాలో కలిసి ఆమె జోడో యాత్రలో పాల్గొన్నారు. జోడో యాత్రకు ఘన స్వాగతం పలికి.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
ఇక ఇవాల్టితో పాదయాత్ర 97 రోజుకు చేరుకుంది. ఉదయం6 గంటలకు తీనాపూర్ లో ప్రారంభమైన జోడో యాత్రకు మాధోపూర్ ప్రజలు ఘన స్వాగతం పలికారు.. ఉదయం10గంటలకు సుర్‌వాల్ బైపాస్ దగ్గర మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు.. రాహుల్ తన క్యాంప్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో సమావేశం కానున్నారు.. రాజస్థాన్ పీసీసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.. తిరిగి 3.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమై దుబ్బి బహాస్ వరకు సాగనుంది అక్కడ జరిగే కార్నర్ మీటింగ్ రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ రాత్రికి దెహ్లాద్‌లో బసచేయనున్నారు రాహుల్.
భారత్ జోడో యాత్రలో మహిళలు సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించి జానపద పాటలు ఆలపిస్తున్నారు..రాజస్థాన్‌లో ఝలావర్, కోట, బుండి, సవాయి మాధోపూర్, దౌసా, అల్వార్ జిల్లాల మీదుగా రాహుల్ జోడో యాత్ర సాగనుంది.