IAF Bidar: నాన్నతో కలిసి నడిచింది.. నింగిలోకీ ఎగిరింది..

IAF Bidar: చిన్నప్పుడు నాన్నతో కలిసి నడిచింది. బుడి బుడి అడుగులతో నడకప్రారంభించింది. పెద్దయ్యాక తండ్రితో కలిసి ఎయిర్‌క్రాప్ట్‌లో ప్రయాణించింది.

Update: 2022-07-06 12:30 GMT

IAF Bidar: చిన్నప్పుడు నాన్నతో కలిసి నడిచింది. బుడి బుడి అడుగులతో నడకప్రారంభించింది. పెద్దయ్యాక తండ్రితో కలిసి ఎయిర్‌క్రాప్ట్‌లో ప్రయాణించింది. తనంత ఎత్తుకు ఎదిగిన కూతుర్ని చూసి తండ్రి ఎంతో ఆనందించారు. IAF తండ్రీ కూతుళ్లు కలిసి హాక్ సోర్టీని ఎగురవేయడం ద్వారా చరిత్ర సృష్టించారు.

ఎయిర్ కమోడోర్ సంజయ్ శర్మ తన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మతో కలిసి కర్ణాటకలోని బీదర్‌లో హాక్ సోర్టీని ఎగుర వేశారు. వీరిద్దరూ హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. "ఐఏఎఫ్‌లో తండ్రి, కుమార్తె ఒక మిషన్ కోసం ఒకే ఫైటర్ నిర్మాణంలో భాగమైన సందర్భాలు ఇంతకు ముందు లేవు అని IAF ఒక ప్రకటనలో తెలిపింది.

ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య ప్రస్తుతం బీదర్‌లో ఉన్నతమైన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో గ్రాడ్యుయేషన్‌ను పొందే ముందు శిక్షణ తీసుకుంటోంది. ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్ పూర్తి చేసింది. అనన్య డిసెంబర్ 2021లో ఫైటర్ పైలట్‌గా నియమితులయ్యారు.

అనన్య తండ్రి ఎయిర్ కమోడోర్ సంజయ్ శర్మ 1989లో IAF యొక్క ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. అతను మిగ్-21 Sqn ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్టేషన్‌కు నాయకత్వం వహించడంతో పాటు, యుద్ధ కార్యకలాపాలలో విస్తృతమైన అనుభం సంపాదించుకున్నారు.

Tags:    

Similar News