గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి!
పుదుచ్చేరికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, స్టేట్ ట్రెజరర్ కేజీ శంకర్(71) కన్నుమూశారు. ఇలాంగోనగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.;
పుదుచ్చేరికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, స్టేట్ ట్రెజరర్ కేజీ శంకర్(71) కన్నుమూశారు. ఇలాంగోనగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పి రాగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు యత్నిస్తుండగానే చనిపోయారు. శంకర్ కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కేజీ శంకర్ మృతిపట్ల పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సహా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. 1950లో పుదుచ్చేరిలో జన్మించిన శంకర్.. 1984 నుంచి ఇప్పటివరకు బీజేపీ నాయకుడిగా కొనసాగారు.