పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్‌ తమిళి సై కీలక నిర్ణయం..!

ఇటీవల నలుగురు MLAల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వాన్ని ఈనెల 22న సా.5గం.కు అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు.

Update: 2021-02-18 16:11 GMT

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నలుగురు MLAల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వాన్ని ఈనెల 22న సా.5గం.కు అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు. దీంతో ఆ రోజు నారాయణ స్వామి ప్రభుత్వ భవితవ్యం తేలనుంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలుండగా.. కాంగ్రెస్-DMK-స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18 మంది సభ్యులతో నారాయణస్వామి నేతృత్వంలో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా, ఇటీవల లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడిని తొలగించి ఆమె స్థానంలో తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News