Bhagwant Mann : పంజాబ్ సీఎం కీలక ప్రకటన.. లంచం అడిగితే..
Bhagwant Mann : రాష్ట్ర అవినీతిని అరికట్టేందుకు ఈ నెల 23న యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.;
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక ప్రకటన చేశారు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక రోజు తర్వాత, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అవినీతిని అరికట్టేందుకు ఈ నెల 23న యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వాట్సాప్ ద్వారా తమ ఫిర్యాదును వీడియో, ఆడియో రూపంలో చేయొచ్చునని అన్నారు.
తన కార్యాలయంలో అధికారులు దీనిని విచారిస్తారని తెలిపారు. "99 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీపరులు కాబట్టి నేను ఏ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం లేదు, అయితే అలాంటి ఉద్యోగులలో 1 శాతం మంది అవినీతిపరులున్నారు.., ఇది వ్యవస్థను కుళ్ళిపోయేలా చేస్తోంది.. ఈ అవినీతి వ్యవస్థను ఆప్ మాత్రమే శుభ్రం చేయగలదు" అని ఆయన ట్వీట్ చేశారు.
ఫిబ్రవరి 5న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'ఆప్ ప్రభుత్వం" ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతిని అంతమొందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.