చత్తీస్‌గఢ్ బీజేపీ ఇంఛార్జిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరికి.. రాయ్‌పూర్‌లో ఘన స్వాగతం లభించింది. తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆమెకు.. మాజీ సీఎం రమణ్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణుదేవ్, రాయ్‌పూర్ ఎంపీ సునీల్ సోనీజీ.. సాదర స్వాగతం పలికారు. కార్యకర్తలు ఆమెపై పూలవర్షం కురిపించారు. అనంతరం ఆమె.. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పటిష్టతపై చర్చించారు. మూడు రోజుల పాటు చత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్న ఆమె.. పార్టీ నేతలతో విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై.. పురంధేశ్వరి అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు.