Putin India Visit: త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..

Putin India Visit: ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న ఇండియాకు వస్తున్నారు.

Update: 2021-11-26 14:15 GMT

Putin India Visit (tv5news.in)

Putin India Visit: ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న ఇండియాకు వస్తున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే రష్యా-భారత్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొంటారు.

అనంతరం ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో పురోగతి, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేయనున్నారు.

కరోనా తర్వాత రష్యా ప్రెసిడెంట్‌కు ఇది రెండో విదేశీ పర్యటన కాగా.. రెండోసారి భారత్‌కు రానున్నారు. 2018లో చివరిసారిగా భారత్‌లో పర్యటించిన పుతిన్.. ప్రధాని మోదీని కలిసి రెండు దేశాల మధ్య పలు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Tags:    

Similar News