రాహుల్ గాంధీకి కరోనా.. !

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. తాజాగా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

Update: 2021-04-20 11:30 GMT

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వీపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రోజురోజుకూ రికార్డు స్ధాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. తాజాగా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆయన భార్య సునీతకి ఈ రోజు ఉదయం కరోనా పాజిటివ్ వచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన ఐసోలేట్ అయ్యారు. 

Tags:    

Similar News