షాకింగ్ : ఓ మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్!
కరోనా విషయంలో వైద్యులకి కూడా షాక్ కి గురిచేసే ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.;
కంటికి కనిపించినా కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే కరోనా విషయంలో వైద్యులకి కూడా షాక్ కి గురిచేసే ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. శారద అనే మహిళకు అయిదు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకింది. అయితే లక్షణాలే లేకున్నా ఆమె పాజిటివ్ వస్తోంది.
దీనితో క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నది. ప్రస్తుతం ఆమెకి భరత్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం హాస్పిటల్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయుర్వేద, హోమియో, అలోపతి మందులతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన శారదకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. అలా ఇప్పటివరకు 31 సార్లు కరోనా సోకింది.