ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.;
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం కన్నుమూశారు.ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనేక దశాబ్దాలపాటు భారత దేశానికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరాడంబరత, నిజాయితీలకు ప్రతిరూపమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీ మన దేశానికి అంకితభావంతో, శ్రద్ధాసక్తులతో సేవ చేశారని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రజా జీవితంలో చేసిన సేవలు, కృషి అమూల్యమైనవని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.