Nagapur: ఆర్థిక ఇబ్బందులతో కబడ్డీ క్రీడాకారిణి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులూ, ఉద్యోగ వేటా, వివాహ వైఫల్యం కారణంగా కబడ్డీ క్రీడాకారిణి కిరణ్ సూరజ్ దాధే ఆత్మహత్య చేసుకుంది.

Update: 2025-12-09 08:56 GMT

అందరి క్రీడాకారుల పరిస్థితి ఒకలా ఉండదు. కొందరికి వద్దంటే కోట్లు, మరికొందరికి కనీస సౌకర్యాలు కూడా ఉండవు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 29 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణి పెళ్లి చేసుకునే ముందు హామీ ఇచ్చిన ఉద్యోగం ఇప్పించలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

ఆర్థికంగా బలహీనంగా ఉన్న కిరణ్ సూరజ్ దాధే 2020లో స్వప్నిల్ జయదేవ్ లాంబ్‌ఘరేను వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు స్వప్నిల్ కాబోయే భార్య కిరణ్ కి, ామె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. తద్వారా వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తుందని పేర్కొన్నాడు. కానీ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి అయిన కిరణ్, తాను మోసపోయానని తరువాత గ్రహించింది.

స్వప్నిల్ ఉద్యోగ ఆఫర్‌ను ఆలస్యం చేస్తుండటంతో పాటు ఆమెను మానసికంగా వేధించడంతో ఇంటిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లింది.

ఆమెకు అత్తవారింటి నుంచి బెదిరింపులు రావడం ప్రారంభించినప్పుడు, ఆమె కుటుంబం ఆమెను కుటుంబ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయమని బలవంతం చేసింది. ఆమె తన ఫోన్‌లో ఆ సందేశాలను సాక్ష్యంగా సేవ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కిరణ్ డిసెంబర్ 4న, విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబసభ్యులు వెంటనే గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత కిరణ్ మరణించింది. 

ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 108 కింద పోలీసులు కేసు నమోదు చేసి, స్వప్నిల్ కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News