ఎంపీల జీతభత్యాలు తగ్గించే బిల్లులకు రాజ్యసభ ఆమోదం

ఎంపీలకు, కేంద్ర మంత్రులకు వేతనాలు, జీతాభత్యాలు 30 శాతం తగ్గించేందుకు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఏకగ్రీవంగా

Update: 2020-09-18 15:43 GMT

ఎంపీలకు, కేంద్ర మంత్రులకు వేతనాలు, జీతాభత్యాలు 30 శాతం తగ్గించేందుకు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మంత్రుల జీతాలు, భత్యాల సవరణ బిల్లు 2020, ఎంపీ జీతం, భత్యాలు, పన్షన్ సవరణ బిల్లు 2020ను కేంద్ర సహాయ మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లులను అమిత్ షా ప్రవేశ పెట్టాల్సి ఉన్నా.. ఆయన అనారోగ్యంతో ఇటీవలే కోలుకొన్నప్పటికీ పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవడంతో ఆయనకు బదులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్, బీజేడీ పార్టీ ఎంపీలు మనస్పూర్తిగా మద్దతు తెలిపారు. అయితే, ఎంపీలాడ్స్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఈ నిధులు విడుదల చేస్తే.. కరోనా కాలంలో ఎంపీలు సహాయ కార్యక్రమాలకు ఉపయోగపడతాయని ఆశించారు.

Tags:    

Similar News