అయోధ్య రామమందిర నిర్మాణం.. వేల కోట్లలో వచ్చిన విరాళం
ఏడాది జనవరి 15 నుంచి విరాళా సేకరణ మొదలు పెట్టింది విశ్వహిందూ పరిషత్.;
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భక్తులు తమ శక్తి కొలది విరాళాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 15 నుంచి విరాళా సేకరణ మొదలు పెట్టింది విశ్వహిందూ పరిషత్. మొదలు పెట్టిన రెండు నెలల కాలంలోనే రూ.3 కోట్ల విరాళాలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ట్రస్ట్ వెల్లడించింది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడం నిలిపివేశామని, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా భక్తులు విరాళాలు పంపవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విరాళాల సేకరణ ఫిబ్రవరి 27తో ముగిసింది. అనేక మంది దాతలు భారీగా విరాళాలు సమర్పించారు.
మరోవైపు రామాలయ పునాది నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమైంది. వేద పూజ అనంతరం పనులు ప్రారంభించారు. 2.77 ఎకరాల స్థలంలో రామాలయ నిర్మాణం అధికారికంగా ఏప్రిల్ 9న ప్రారంభమవుతుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆ రోజే ఆలయం, గర్భాలయ నిర్మాణం ప్రారంభమవుతుంది.
సోమవారం 40 అడుగుల పునాదిలో 1 అడుగు కాంక్రీట్ వేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పునాది నిర్మాణం ఆగస్ట్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. అప్పటి నుంచి అసలైన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వివరించారు.