Ravi Shankar Prasad : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతా నిలిపివేత
Ravi Shankar Prasad : కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్‌ను నిలిపివేసింది ట్విట్టర్. తన ట్విట్టర్ అకౌంట్... గంటపాటు నిలిచిపోయినట్లు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.;
Ravi Shankar Prasad : కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్‌ను నిలిపివేసింది ట్విట్టర్. తన ట్విట్టర్ అకౌంట్... గంటపాటు నిలిచిపోయినట్లు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆ సమయంలో.. ఎలాంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ పోస్ట్ చేయలేకపోయానన్నారాయన. టీవీ చర్చలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం వల్ల... ఆ పోస్టులు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై తన ట్విట్టర్ అకౌంట్ పని చేయలేదన్నారు మంత్రి రవిశంకర్ ప్రసాద్.
రవిశంకర్ ప్రసాద్ అకౌంట్ నెట్ యూజర్లకు కనిపించినా.... మంత్రి అకౌంట్‌లోకి లాగిన్ కావడానికి.. లేదా పోస్ట్ చేయడానికి మాత్రం యాక్సిస్ దొరకలేదు. కంటెంట్ పోస్ట్ చేస్తున్న సమయంలో... డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ నోటీసు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ట్విట్టర్ చర్యలను తీవ్రంగా ఖండించిన రవిశంకర్ ప్రసాద్.... ఇది పూర్తిగా భారతీయ ఐటీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తన అకౌంట్‌కు యాక్సిస్ ఇవ్వలేదన్నారాయన. గత కొంతకాలంగా.. ట్విట్టర్, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో....రవిశంకర్ శంకర్ ప్రసాద్ అకౌంట్‌ను ట్విట్టర్ నిలిపివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.