RBI డిప్యూటీ గవర్నర్ గా ఎం రాజేశ్వరరావును నియమిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. విశ్వనాధన్ పదవీకాలం మార్చిలోనే ముగిసినా.. ఇప్పటివరకూ ఖాళీగానే పోస్ట్ ఉండిపోయింది. దీంతో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా బాధ్యతల్లో ఉన్న రాజేశ్వరరావును అపాయింట్మెంట్ కమిటీ నియమించింది. RBIలో ఉన్న 12 మంది ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లలో అత్యంత సీనియర్ రాజేశ్వరరావు, ఆయన 1984లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యారు. వివిధ విభాగాల్లో పనిచేసినఅనుభవం ఉంది. 2016లో EDగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్గా వ్యవహరించారు. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ RBI రీజనల్ కార్యాలయాల్లోనూ పనిచేశారు.