RBI: కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్..
RBI: ఆన్‌లైన్‌లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్ పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేవైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.;
RBI: ఆన్‌లైన్‌లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్ పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేవైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
కేవైసీ ధృవీకరణ లేదా అప్‌డేషన్ కోసం కస్టమర్లు కచ్చితంగా బ్యాంకుకు రావాలంటూ అధికారులు డిమాండ్ చేయరని, అలాంటి నిబంధన పెట్టలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అలాగే సెంట్రల్-కేవైసీ (సీ-కేవైసీ) పోర్టల్‌లో తమ వివరాలను అప్‌లోడ్ చేసిన కస్టమర్లను కూడా బ్యాంకులు వెరిఫికేష్ కోసం పిలవరని తెలిపారు.
అలాంటి సందర్భాల్లో కస్టమర్లు తమ కేవైసీ వివరాలను సీ-కేవైసీ పోర్టల్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అధికారిక ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబరు ద్వారా బ్యాంకుకు మెసేజ్ పంపించవచ్చని దాస్ పేర్కొన్నారు.