SBI Allert Message: మోసగాళ్లు పంపే మెసేజ్.. క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక

SBI Allert Message: మీరు ఈ మెసేజ్‌ను నమ్మి లింక్‌పై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది.

Update: 2021-03-02 07:14 GMT

SBI Allert Message


SBI Allert Message: దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో అకౌంట్ ఉన్న కస్టమర్లు హ్యాకర్ల నుంచి రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు బ్యాంకు పలు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అందులో భాగంగానే మరోసారి మోసగాళ్లు తమ ఖాతాదారులను టార్గెట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కస్టమర్లకు బ్యాంకు టెక్స్ట్ మెసేజ్‌లు పంపించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని ఉంటుంది. ఈ మెసేజ్‌లో ఒక లింక్ కూడా ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పాయింట్లు రిడీమ్ చేసుకోవాలని మోసగాళ్లు మెసేజ్ పంపుతారు.

మీరు ఈ మెసేజ్‌ను నమ్మి లింక్‌పై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. ఎలా అంటే మీరు లింక్‌పై క్లిక్ చేస్తే ఫేక్ వెబ్‌సైట్ ఒకటి ఓపెనవుతుంది. ఇందులో మీరు మీ ఎస్‌బీఐ వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ డేటాను మోసగాళ్లు తస్కరిస్తారు. వీటి ద్వారానే మీ బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు వాళ్ల అకౌంట్‌లోకి ట్రాన్సఫర్ అవుతాయి.

సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లో ఉండే ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందువలన ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ లింక్ పైనా క్లిక్ చేయొద్దని బ్యాంక్ చెబుతోంది. లేదంటే మీకు తెలియకుండానే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. 

Tags:    

Similar News