Karnataka Bitcoins : కర్ణాటక రాజకీయాల్లో బిట్ కాయిన్ల దుమారం..!
Karnataka Bitcoins : కర్ణాటక రాజకీయాలను బిట్ కాయిన్ల అంశం కుదిపేస్తోంది. ఇటీవల 9 కోట్ల రూపాయల విలువగల బిట్ కాయిన్ల వ్యవహారం బయటపడింది.;
Karnataka Bitcoins : కర్ణాటక రాజకీయాలను బిట్ కాయిన్ల అంశం కుదిపేస్తోంది. ఇటీవల 9 కోట్ల రూపాయల విలువగల బిట్ కాయిన్ల వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంతో బీజేపీ నేతలకు సంబంధం ఉన్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బిట్ కాయిన్ స్కామ్ నిందితుడు జన్‌ధన్ ఖాతాలను హ్యాక్ చేసి 6వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు.
ఈ విషయం ప్రధాని మోదీకి కూడా తెలిసుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి ఇటీవల 9కోట్ల రూపాయల విలువైన బిట్ కాయిన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతలకు ప్రమేయం ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హ్యాకర్ శ్రీకృష్ణ గతంలో ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాకింగ్ చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు కూడా అతడిపై ఆరోపణలున్నాయి.