సునీత-రామ్‌ల వివాహ తేదీ..
సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రెటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీ..;
సుమధుర గాయని సునీత వివాహ తేదీ ఖరారైంది. డిసెంబర్ 26న వివాహ తేదీని నిర్ణయించినా అనుకోని కారణాల వలన వాయిదా పడిన వీరి వివాహం జనవరి 9న జరగనుంది. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరవుతారని సమాచారం. కొన్ని రోజుల ముందే సన్నిహితుల సమక్షంలో రామ్, సునీతల నిశ్చితార్ధం జరిగింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేసి సింగర్స్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ రోజు (శనివారం) సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రెటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు.