Smriti Irani: ఏం చెప్పారు మేడమ్.. అమ్మాయిలూ.. అస్సలు మిస్ కావద్దు!!

దాన్ని చదివిన వారు నిజంగానే ఇది ఆలోచించవలసిన విషయమే.. మేడమ్ భలే సలహా ఇచ్చారు అంటూ కాసేపు నవ్వుకున్నారు.;

Update: 2021-07-23 11:29 GMT

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె తరచు చాలా ఆసక్తికరమైన పోస్టులను పెడుతుంటారు. శుక్రవారం స్మృతి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సలహాను పంచుకున్నారు. దీనిలో పెళ్లి చేసుకున్న వ్యక్తుల కోసం ఆమె ఓ సలహా ఇచ్చారు. దాన్ని చదివిన వారు నిజంగానే ఇది ఆలోచించవలసిన విషయమే.. మేడమ్ భలే సలహా ఇచ్చారు అంటూ కాసేపు నవ్వుకున్నారు.

'ఒక వ్యక్తిని వివాహం చేసుకునే ముందు నెట్ స్లోగా ఉన్న కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీన్ని బట్టి అతడి వ్యక్తిత్వం ఏంటి అనేది తెలిసి పోతుంది అని పోస్ట్ చేశారు. అడ్వైస్ ఆంటీ పేరుతో మరో పోస్ట్ చేశారు. ఏదీ ఫర్‌ఫెక్ట్‌గా ఉండదు.. దానిని మనకు తగ్గట్టుగా మలచుకోవాలి.. అదే జీవితం అని రాసుకొచ్చారు.






 


 


Tags:    

Similar News