Sonia Gandhi : సోషల్ మీడియాను నియంత్రించాలన్న సోనియా గాంధీ
Sonia Gandhi : సోషల్ మీడియాను నియంత్రించాలన్నారు కాంగ్రస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. లోక్ సభలోని జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు.;
Sonia Gandhi : సోషల్ మీడియాను నియంత్రించాలన్నారు కాంగ్రస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. లోక్ సభలోని జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. ఎన్నికలు, రాజకీయాల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ జోక్యం చేసుకుంటున్నాయని... వాటి జోక్యానికి స్వస్తి పలకాలని కేంద్రాన్ని కోరారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు.. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వడంలేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అందండలతో ఫేస్ బుక్ ద్వారా సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. భావోద్వేగపూరితమైన తప్పుడు సమాచారంతో యువకుల మనసులు ద్వేషంతో నింపబడుతున్నాయని ఆమె అభిప్రాయ పడ్డారు.