Sonia Gandhi : ఎన్నికల ఫలితాలపై సోనియా అసంతృప్తి..!
Sonia Gandhi : ఇటీవల వెలువడిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.;
Sonia Gandhi : ఇటీవల వెలువడిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్ లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయామని CWC సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ ఎందుకు విఫలమవుతుందో సమీక్షించుకోవాలని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కేరళ, అసోం రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలను కాంగ్రెస్ ఎందుకు గద్దె దింపలేకపోయిందో సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటమిపై నివేదిక సమర్పించాలన్నారు. ఇక కరోనా కట్టడిలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని, దేశంలో చావులకు మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శాస్త్రవేత్తల సలహాలను పెడచెవిన పెట్టడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు.